ఆ రెండు అంశాలపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు.. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన

by Kema Shiva Kumar |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.

ఆ రెండు అంశాలపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు.. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉభయ సభల్లో బీహార్ ఎన్నికల సందర్బంగా ఈసీ చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)తో పాటు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు అందజేశారు. అయితే, ప్రశ్నోత్తరాలను పక్కన పెట్టి తామిచ్చిన వాయిదా తీర్మానాలపై వెంటనే చేర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉభయ సభల్లోని స్పీకర్లు వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించకపోవడంతో విపక్ష నేతలంతా పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లోక్‌సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్, రాజ్యసభలో రణదీప్ సింగ్ సుర్జేవాలా వాయిదా తీర్మానాలు అందజేశారు. ఇక తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై చర్చకు లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి వాయిదా తీర్మానం ఇచ్చారు.

Next Story