- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆప్ చేసింది మహా పాపం
యమునా నదిని కలుషితం చేసింది ఆప్ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు.

- చొరబాటుదారులకు ఢిల్లీ నివాసంగా మారింది
- బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు స్థిరపడ్డారు
- ఆప్ హయాంలో పౌరులకు సౌకర్యలు కల్పించలేదు
- యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్
దిశ, నేషనల్ బ్యూరో:
బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాటుదారులు ఢిల్లీలో స్థిరపడిన పాపం ఆమ్ ఆద్మీపార్టీకే చెందుతుంది. వాళ్లను ఈ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకునేలా చేసి.. ఆప్ ఘోర పాపం చేసిందని యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆరోపించారు. ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆదిత్యానాథ్ పాల్గొన్నారు. ఢిల్లీలో పౌరులకు సౌకర్యలు కల్పించడంలో, మౌలిక వసతులు మెరుగుపరచడంలో ఆప్ సర్కార్ విఫలమైందని యోగి అన్నారు. యూపీలోని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో ఢిల్లీ కంటే మెరుగైన వసతులు ఉంటాయని అనేక మంది వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారని ఆదిత్యానాథ్ చెప్పారు. యమునా నదిని కలుషితం చేసింది ఆప్ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. ఇవ్వాళ తాను ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వస్తుంటే యమునా నదిని చూసి నేను బాధపడ్డాను. ఒకప్పుడు మనకు పవిత్రతకు మారుపేరుగా ఉన్న నదిలో నుంచి ఇప్పుడు డ్రైనేజీ కాలువల్లో నుంచి వచ్చే దుర్వాసన వస్తోంది. ఆప్ చేసిన పాపాలకు ప్రజలు బాధపడుతున్నారు. త్వరలోనే ఢిల్లీని వారి పాపాల నుంచి విముక్తి చేస్తామని ఆదిత్యానాథ్ చెప్పారు. ఆప్ బారి నుంచి బయటపడాలంటే బీజేపీకి ఓటు వేయాలని, ఇక్కడ మా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆదిత్యానాథ్ అన్నారు.






