- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadhaar: ఆధార్‌ను ఐడీ ప్రూఫ్‌గా పరిగణించండి.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశించింది. దానిని12వ పత్రంగా అంగీకరించాలని తెలిపింది. ఆధార్ (Aadhaar) అనేది గుర్తింపునకు మాత్రమే సహాయపడుతుందని, భారత పౌరసత్వానికి దానిని రుజువుగా ఉపయోగించలేమని స్పష్టం చేసింది. బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధార్ కార్డును అధికారులు ఐడెంటిటీ ప్రూఫ్ గా పరిగణించాలని, అయితే, ఆధార్ కార్డు ప్రామాణికత, వాస్తవికతను ధ్రువీకరించే హక్కు అధికారులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే, కమిషన్ దానిపై దర్యాప్తు చేయాలని తెలిపింది. ఎన్నికల సంఘం తన అధికారులకు ఆర్డర్స్ ఇవ్వాలని పేర్కొంది. అనంతరం ఆధార్‌ను గుర్తింపు కార్డుగా అంగీకరిస్తామని ఈసీ అత్యున్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది.






