- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధ్యాత్మిక ప్రదేశంలో ఫారెన్ మందు అమ్మకం (వీడియో)
ఇంటి ఎదుట వాహనంలో విదేశీ మద్యం విక్రయించిన యువకుడు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలోని కుమారపురం పబ్లిక్ రోడ్డులో ఇషాన్ నిహాల్ అనే యువకుడి ఇళ్లు ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి ఎదుట వాహనంలో విదేశీ మద్యం విక్రయించిన యువకుడు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలోని కుమారపురం పబ్లిక్ రోడ్డులో ఇషాన్ నిహాల్ అనే యువకుడి ఇళ్లు ఉంది. ఇంటినే బార్ మాదిరిగా చేసి, ఇంటి బయట వాహనంలో దాదాపు 10 దేశాలకు చెందిన మద్యాన్ని విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ అధికారులు దాడిచేసి యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మద్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయించడంతో పాటు సోషల్ మీడియాలో కోక్టెయిల్ ప్రకటనలు చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు చూసి, అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశమైన తిరువనంతపురంలో మద్యం విక్రయాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/shorts/0Z7TagAt3Q4






