Jharkhand: మూడేళ్ల నర్సరీ విద్యార్థినిపై.. వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి !

by Geesa Chandu |
Jharkhand: మూడేళ్ల నర్సరీ విద్యార్థినిపై.. వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి !
X

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థిని పై పాఠశాల వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న సదరు బాలిక కడుపు నొప్పితో బాధ పడుతూ విషయమంతా తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసు అధికారి రిషవ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ లోని మ్యాంగో పోలీస్ స్టేషన్ పరిధిలో దైగుట్టు లో జయశ్రీ తివారీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఈస్ట్ సింగ్భుమ్ జిల్లాలోని స్థానిక ఓల్డ్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లైంగిక దాడి గురైన సదరు బాలిక కూడా అదే పాఠశాలలో నర్సరీ చదువుతోంది. శుక్రవారం (ఆగస్టు 9) నాడు డ్రైవర్ తివారీ.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తదనంతరం ఎప్పటిలాగే స్కూల్ ముగిసాక ఇంటికి చేరుకున్న బాలిక, కడుపు నొప్పితో బాధ పడుతూ జరిగిన విషయమంతా తల్లితండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న బాధితురాలి పేరెంట్స్ స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం(ఆగస్టు 10) ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనకు కారకుడైన వ్యక్తి తివారీని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.



Next Story