దేశవ్యాప్తంగా సోషల్ మీడియా బ్యాన్.. రాజధానిలో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి

by Malleboina Mahesh |   (  Updated:2025-09-08 08:21:50  IST  )

నేపాల్ లో సోషల్ మీడియాపై నిషేదం విధించడంపై జెన్ z పేరుతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సోషల్ మీడియా బ్యాన్.. రాజధానిలో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ప్రపంచంలో ఏ దేశం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయాన్ని నేపాల్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా Facebook, Instagram, YouTube, WhatsApp, X (Twitter) వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. దీంతో సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండూ తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని కారణంగా Facebook, Instagram, YouTube, WhatsApp, X (Twitter) వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, పౌర సమాజ ప్రతినిధులు ఖాట్మాండు మైటీ ఘర్ మండల, న్యూ బనేశ్వర్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనకు దిగారు.

సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యా రంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు. ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా కూడా ఈ నిరసనలకు మద్దతు తెలుపుతూ, యువత ఆందోళన ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో GEN Z పేరుతో వేలాది మంది యువకులు, నిరసన కారులు రోడ్లపైకి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నేపాల్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనరల్ జెడ్ ఒక భారీ నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రారంభమైన నిరసన సోమవారం వీధుల్లోకి వ్యాపించింది.

పార్లమెంట్ సమీపంలో ప్రదర్శనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. చాలా మంది నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లారు. పోలీసు బారికేడ్లను దాటుకుంటు పార్లమెంట్ లోకి పరుగులు తీశారు. ఘర్షణలు తీవ్రమవడంతో, పోలీసులు అనేక ప్రదేశాలలో కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపు తప్పుడంతో అప్రమత్తం అయిన అధికారులు రాజధానిలో కర్ఫ్యూ విధించారు. దీంతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో నేపాల్ ప్రభుత్వం స్థానికంగా ఆర్మీని రంగంలోకి దించింది.

Next Story