కుంభమేళాలో షాకింగ్ ఘటన.. మహిళ స్నానం చేస్తుండగా వచ్చిన పాము.. ఏం చేసిందో తెలుసా?(వైరల్ వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-02 09:31:12  IST  )

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోజగరాజ్‌(Prayag Raj)లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.

కుంభమేళాలో షాకింగ్ ఘటన.. మహిళ స్నానం చేస్తుండగా వచ్చిన పాము.. ఏం చేసిందో తెలుసా?(వైరల్ వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయోజగరాజ్‌(Prayag Raj)లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ మహాకుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభమై.. ఫిబ్రవరి 26వ తేదీన ముగిసింది. గత నెల 26న మహాశివరాత్రి కావడంతో భక్తులు(Devotees) అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి, భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

కుంభమేళాకు సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం హాజరై త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. దాదాపు మహాకుంభమేళలో 70 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు సైతం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా ఆసక్తి చూపించారు. రైళ్లు, విమానాలు, బస్సులు, సొంత వాహనాల్లో భక్తులు కుంభమేళకు భారీగా తరలివచ్చారు. దీంతో కుంభమేళ జనసంద్రాన్ని తలపించింది.

ఇదిలా ఉంటే.. శివరాత్రి రోజున ఓ మహిళ మహాకుంభమేళా(Mahakumbh Mela)కు చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. గంగా దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఒక భారీ సర్పం(Snake) ఆమె వద్దకు వచ్చింది. పామును చూసిన సదరు మహిళ ఏ మాత్రం భయపడలేదు. తనను ఆశీర్వాదం ఇవ్వడానికి సర్పరాజ్ వచ్చాడని ఆనంద పడింది. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ గురయ్యారు.

Next Story