- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Meteorite Fell to Earth: భూమిపై రాలిపడిన ఉల్క..వైరల్ గా వీడియో

దిశ, వెబ్ డెస్క్ : అనంత విశ్వంలో అంతరిక్షం(Space)లో దాగిన రహస్యాలు పరిశోధకులకు..ప్రజలకు ఎన్నో సవాళ్లను, ఉత్కంఠతను రేపుతుంటాయి. సౌర తుఫాన్ లు, ఉల్కా పాతాల ఘటన(Meteor shower)లు తరుచు వింటుంటాం. అంతరిక్షం నుంచి భూమి(Earth)పైకి ఉల్క(Meteorites)లు దూసుకరావడం అరుదుగా జరిగే సంఘటనలే అయినప్పటికి వాటికి సంబంధించిన సమాచారం భూమండలం నివాసితులకు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఉల్కలు ఎప్పుడు..ఎక్కడ..ఎంత పరిమాణంలో పడ్డాయి..వాటితో ఏదైనా నష్టాలు సంభవించాయా అన్న వార్తలు సర్వత్రా ఆసక్తికరమే. తాజాగా ఆకాశం నుంచి ఓ ఉల్క భూమిపై పడిన సంఘటన ఇప్పుడు వైరల్(viral)గా మారింది.
సినిమాల్లో మాదిరిగా ఆకాశం నుంచి ఉల్కలు భూమిపై పడినట్లుగానే అంతరిక్షం నుంచి రాలిపడిన ఓ చిన్న ఉల్క వార్త సంచలనం రేపుతోంది. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐల్యాండ్‌లో అంతరిక్షం నుంచి పడిన చిన్న ఉల్క బుల్లెట్‌లా దూసుకొచ్చి.. ఓ గోడకు గుద్దుకొని ముక్కలైంది. పెల్లుమన్న భారీ శబ్ధంతో మండుతూ నేలను ఢీ కొట్టిన ఉల్క ముక్క వెంటనే కాలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. డోర్‌బెల్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఉల్కలు గంటకు వేల మైళ్ల వేగంతో భూమిని తాకుతాయని..చాల వరకు భూమిని చేరేలోపునే మండిపోతాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉల్కలు సౌర మండలంలోని శిధిల పదార్ధాలు. అంతరిక్షం నుంచి వేరుపడి, భూగురుత్వాకర్షణకు లోనై కొన్ని ఉల్కలు నేలవైపు దూసుకువస్తుంటాయి. వీటిని, 'షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అని కూడా పిలుస్తారు. కానీ ఇవి సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించేలోపే చిన్న చిన్న రాళ్లుగా విడిపోయి మండిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి భూమికి చేరుతుంటాయని తెలిపారు.
2014లో కనుగొన్న అతిపెద్ద ఉల్క సముద్రంలో పడిన కారణంగా మానవ చరిత్రలోనే అతిపెద్దదైన సునామీ సంభవించిందని, సముద్రాలు భగభగ మండిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.దాదాపు 300 కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు అంతరించిపోయేలా చేసిన గ్రహశకలం కంటే, ఈ అంతరిక్ష శిల(స్పేస్ రాక్) 200 రెట్లు పెద్దదని శాస్త్రవేత్తలు అప్పట్లో అంచనా వేశారు.