షాకింగ్ ఘటన.. తల్లి చేయి పట్టుకని నడుస్తున్న చిన్నారి.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడింది! (వీడియో)

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-26 12:37:51  IST  )

రాజస్థాన్‌లో (Rajasthan) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

షాకింగ్ ఘటన.. తల్లి చేయి పట్టుకని నడుస్తున్న చిన్నారి.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడింది! (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో (Rajasthan) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జోధ్‌నూర్ నగరంలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. తల్లి చేయి పట్టుకుని రోడ్డుపక్కన నడుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో చిన్నారి అమాంతంగా గాల్లోకి ఎగిరి సుమారు 25 అడుగుల దూరంలో పడింది. ఈ ఘటనతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న తల్లికూతుళ్లను ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కారును ఓ మైనర్ నడిపినట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వటంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Next Story