JD Vance: అది ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండే హక్కు లేదు

by Shamantha N |

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గ్రీన్ కార్డుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన వారికి అమెరికాలో ఎప్పటికీ ఉండిపోయే హక్కు లేదు.

JD Vance: అది ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండే హక్కు లేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గ్రీన్ కార్డుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన వారికి అమెరికాలో ఎప్పటికీ ఉండిపోయే హక్కు లేదు. ఇది వాక్‌స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో విలీనం చేసుకోవాలో మేం నిర్ణయిస్తాం’’ అని పేర్కొన్నారు. గ్రీన్‌కార్డుదారులు అమెరికాలో ఎప్పటికీ ఉండలేరని జేడీ వాన్స్‌ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ట్రంప్‌ సర్కారు ఇమిగ్రేషన్‌ విధానాలపై చర్చ జరుగుతున్న వేళ వాన్స్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.

గోల్డ్ కార్డ్ విధానం

ఇప్పటికే గ్రీన్‌కార్డుకు పోటీగా ట్రంప్‌ గోల్డ్‌కార్డ్‌ విధానం ప్రకటించారు. దీనిలో సుదీర్ఘకాలంపాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. 5 మిలియన్‌ డాలర్లు చెల్లించి దీనిని కొనుగోలు చేసి.. ఈ కార్డును పొందొచ్చు. దీంతో అమెరికా పౌరసత్వం కూడా సాధించుకోవచ్చని ట్రంప్‌ సర్కారు చెబుతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ఎగ్జిక్యూటివ్‌లను ఆకర్షించాలన్నది ట్రంప్‌ ప్లాన్‌. అదే సమయంలో ప్రతిభావంతులైన విదేశీయుల కోసం కంపెనీలు గోల్డ్‌కార్డు కొనుగోలు చేసి.. వారిని దేశానికి రప్పించవచ్చని సూచించారు. ఇప్పటికే అమెరికాలో అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ వీసాను సరికొత్త గోల్డ్‌కార్డ్‌ భర్తీ చేయనుంది. ఇక అమెరికా వర్క్‌ వీసాలను అత్యధికంగా దక్కించుకొంటున్న దేశాల్లో భారత్‌ టాప్‌లో ఉంది. అక్టోబర్‌ 2022-సెప్టెంబర్‌ 2023 నాటికి జారీ చేసిన వర్క్‌ వీసాల్లో 72.3శాతం భారతీయులకే జారీ అయ్యాయి.

Next Story