- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూగజీవి కన్నీటి వీడ్కోలు!.. ఆహారం పెట్టిన వృద్ధురాలి మృతదేహాం వద్ద కోతి
అమ్మ ఆకలి తీర్చింది. ఆ వానరం రుణం తీర్చుకుంది. అంతిమ యాత్రలో కంటతడి పెట్టించిన దృశ్యం.

దిశ, డైనమిక్ బ్యూరో: మనుషుల మధ్య మానవత్వం కరువవుతున్న ఈ కాలంలో తమ ఆకలి తీర్చిన తల్లి పట్ల ఓ వానరం చూపిన ప్రేమ అందరినీ కలిచివేసేలా చేసింది. ప్రేమకు భాష అవసరం లేదని, మూగజీవులకు అది అర్థమైనంతగా మనుషులకు కూడా అర్థం కాదేమో అనిపించేలా కనిపించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని రాయర దొడ్డి గ్రామానికి చెందిన పార్వతమ్మ (85) అనే వృద్ధురాలు గత సోమవారం వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అయితే ఆమె బ్రతికున్న సమయంలో కొన్నేళ్లుగా తన ఇంటి పరిసరాల్లో తిరిగే కోతులకు క్రమం తప్పకుండా ఆహారం పెట్టేది. చాలా మంది స్థానికులు ఈ విషయంలో పార్వతమ్మ చేస్తున్న పనికి అభ్యంతరం వ్యక్తం చేసినా ఆమె మాత్రం ఆ కోతులకు ప్రేమగా ఆప్యాయంగా ఆహారం అందించేది.
ఆఖరి నివాళి:
ఇటీవల పార్వతమ్మ మరణించడంతో ఆమె నివాసం వద్ద ఆమె భౌతిక కాయాన్ని ఉంచారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఓ కోతి పార్వతమ్మను భౌతిక కాయం వద్ద మౌనంగా కూర్చుని ఆమె ముఖాన్ని నిమురుతూ ఆమెను హత్తుకుంది. ఇన్నాళ్లు ఆహారం పెట్టిన అమ్మకు ఇదే ఆఖరి నివాళి అన్నట్లుగా ఆ కోతి చేసిన పనికి అక్కడ ఉన్నవారందరిని కంటతడి పెట్టేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.






