ఆరేళ్లుగా గుంతలోనే నివాసం.. కలిచివేస్తోన్న లక్ష్మి మోహన్ రాయ్ ఫ్యామిలీ దీన గాథ!

by Disha Web Desk 19 |
Mamata Banerjee to replace governor as chancellor of west bengal Universities
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. అసలే పేదరికంతో అల్లాడుతున్న ఓ కుటుంబం ప్రకృతి వైఫరీత్యాల కారణంగా ఆరేళ్లుగా ఓ గుంతలో కాలం వెళ్లదీస్తోంది. పశ్చిమబెంగాల్‌లోని బంగాల్ జల్పాయ్ గుడిలోని అముగ్రి శివారులో ఛాప్ గఢ్ గ్రామానికి చెందిన కుటుంబం గాథ అందరిని కలిచివేస్తోంది. లక్ష్మి మోహన్ రాయ్ అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి పక్కా ఇల్లు లేకపోవడంతో ఓ రేకుల షెడ్డులో తన భార్య ఇద్దరు పిల్లులు, తన అత్త కలిసి ఐదుగురు ఆ షెడ్డులోనే నివసిస్తున్నారు. అయితే తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇల్లు పూర్తిగా దెబ్బతిని తల దాచుకోవడానికి ఆ కుటుంబం తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది.

దీంతో రేకుల షెడ్డులోనే ఓ భారీ గుంతను తవ్వి అందులో ఆ కుటుంబం తలదాచుకోవడం మొదలు పెట్టింది. తమ పరిస్థితిని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని లక్ష్మి మోహన్ రాయ్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గుంతలో నివసిస్తున్న ఈ కుటుంబానికి నీటి సదుపాయం కూడా లేకపోవడంతో రేకుల షెడ్డు సమీపంలోనే ఓ చిన్న బావిని తవ్వుకుని ఆ నీటినే త్రాగేందుకు ఉపయోగిస్తున్నారు.

తమ పరిస్థితిపై స్పందించిన మోహన్.. ఎన్నికల వేళలో మాత్రమే తమ వద్దకు నాయకులు వస్తారని ఆ తర్వాత తమను పట్టించుకునే వారే ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రేకుల షెడ్డు అనేక సందర్భాల్లో గాలీ, వర్షాలకు కొట్టుకోపోయిందని తుఫానులు వస్తే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇకనైనా తమ బాధలను పట్టించుకుని ప్రభుత్వం తమ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే మోహన్ రాయ్ కుటుంబ పరిస్థితిపై అముగ్రి సర్పంచ్ దిలీప్ రాయ్ వాదన మరోలా ఉంది. లక్ష్మి మోహన్ రాయ్ అలీపుర్ దౌర్ గ్రామంలో నివసించే వాడని.. ఈ కుటుంబానికి అక్కడే రేషన్ కార్డు ఉందని అందువల్ల ప్రభుత్వ పథకాలు ఇక్కడ అందడం లేదని స్పష్టం చేశారు. అతడికి అవసరమైన సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇటీవలే ఈ కుటుంబం పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని వీరికి గ్రామ పంచాయతీ సొంత నిధులతో పక్కా ఇల్లు కట్టిస్తామన హామీ ఇచ్చారు. అలాగే నిత్యావసర సరుకులు సైతం అందజేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం దీదీ సర్కార్‌కు ఇబ్బందిగా మారనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed