పెళ్లి అయిన మూడు నిమిషాల్లోనే విడాకులిచ్చి పడేసిన భార్య..

by Sujitha Rachapalli |

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నూరేళ్ల మంటగా తయారైనట్లు అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే. ఎప్పుడు ఎందుకు విడిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కమిట్మెంట్, అండర్‌స్టాండింగ్ తగ్గిపోయి.. ఎవరి దారులు వారు వెతుక్కుంటున్నారు దంపతులు.

పెళ్లి అయిన మూడు నిమిషాల్లోనే విడాకులిచ్చి పడేసిన భార్య..
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నూరేళ్ల మంటగా తయారైనట్లు అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే. ఎప్పుడు ఎందుకు విడిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కమిట్మెంట్, అండర్‌స్టాండింగ్ తగ్గిపోయి.. ఎవరి దారులు వారు వెతుక్కుంటున్నారు దంపతులు. ఇక ఈ భార్య అయితే కనీసం మూడు నిమిషాలు కూడా భర్తను భరించలేకపోయింది. పెళ్లి అయిన త్రీ మినిట్స్‌లో విడాకులు ఇచ్చేసింది. దీంతో ఈ మ్యారేజ్ అతి చిన్న వివాహ బంధంగా చరిత్రలో నిలిచిపోయింది.

2019లో వివాహ వేడుక పూర్తి చేసుకుని.. కోర్టుహౌస్ నుండి బయటకు వెళ్తుండగా వధువు జారి పడింది. ఆమెకు సహాయం చేయడానికి బదులు.. స్టుపిడ్ అంటూ ఎగతాళి చేశాడు వరుడు. ఈ అవమానం ఆమెను బాగా హర్ట్ చేసింది. వెంటనే వివాహాన్ని రద్దు (అనల్మెంట్) చేయాలని కోరింది. న్యాయమూర్తి ఆమె అభ్యర్థనను వెంటనే అప్రూవ్ చేసి.. వివాహం జరిగిన మూడు నిమిషాల్లోనే అధికారికంగా రద్దు చేశారు. ఈ సంఘటన ఆ దేశంలో నమోదైన అతి చిన్న వివాహంగా నమ్మబడుతుంది.

ఇలాంటి మరో సంఘటన 2004లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగింది. స్కాట్ మెక్‌కీ, విక్టోరియా ఆండర్సన్ గ్రేటర్ మాంచెస్టర్‌లోని స్టాక్‌పోర్ట్ రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకున్న 90 నిమిషాలకే ఎండ్ కార్డ్ వేసేశారు. మ్యారేజ్ పార్టీలో మెక్‌కీ బ్రైడ్స్‌మెయిడ్స్‌కు టోస్ట్ చేయడం ఆండర్సన్‌కు కోపం తెప్పించింది. తట్టుకోలేక యాష్‌ట్రేతో కొట్టింది. ఈ వివాదం కాస్త ముదిరిపోవడంతో పోలీసులు రాగా.. మెక్‌కీ ఇద్దరు అధికారులపై దాడి చేశాడు. ఇందుకు గాను రాత్రంతా జైలులో గడిపాడు. మొత్తానికి హ్యాపీగా గడపాల్సిన హనీమూన్ ప్లాన్‌ను క్యాన్సిల్ చేయడమే కాదు వెంటనే విడాకులు కూడా తీసుకున్నారు.

Next Story