- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 9 మంది మృతి
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లోని నాసిక్-గుజరాత్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్(Nashik) నుంచి కుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.35 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోతు గల లోయలో పడిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. లోయలో పడిన బస్సును వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం రాత్రి ఈ ఘటన జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
Next Story






