Rape : ఐదేళ్ల చిన్నారిపై 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారం..షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

by Sathputhe Rajesh |   (  Updated:2025-01-17 16:25:46  IST  )

ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లిన చిన్నారిపై 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.

Rape : ఐదేళ్ల చిన్నారిపై 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారం..షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లిన చిన్నారిపై 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హనుమంతల్ ఎస్‌‌ఐ సంగీతా చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక(5) బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో నిందితుడి మనవరాలితో ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి స్నేహితురాలు ఇంట్లో లేదు. దీంతో నిందితుడు మహమ్మద్ ఇస్లాం(42) ఇదే అదునుగా భావించి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబం, నిందితుడి ఫ్యామిలీ ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్నారు. ఇరు కుటుంబాలకు పరిచయం ఉంది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించాం. తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం.’ అని ఎస్ఐ తెలిపారు.

Next Story