- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన ప్రైవేట్ బస్సు.. 8 మంది మృతి, మరి కొందరి పరిస్థితి విషమం
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కుప్వీ నుంచి సిమ్లాకు ప్రయాణిస్తున్న ఈ బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సిర్మూర్ జిల్లా హరిఫుర్‌ధర్ ప్రాంతంలోని మారుమూల కొండదారిలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
వాహనం నియంత్రణ కోల్పోయి లోయలోకి..
వాహనం నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సిర్మూర్ జిల్లా ఎస్పీ నిశ్చింత్ సింగ్ నేగి ఘటనను ధృవీకరించారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు. బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో ఇదే..






