- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య పరస్పరం దాడులు
రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మరోసారి పరస్పరం భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. రష్యాతో మూడేళ్ల యుద్ధాన్ని ముగించడం గురించి ఉక్రెయిన్ ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలోని అమెరికా అగ్ర దౌత్యవేత్తతో సమావేశం కానున్న సమయంలో ఈ దాడి జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మరోసారి పరస్పరం భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. రష్యాతో మూడేళ్ల యుద్ధాన్ని ముగించడం గురించి ఉక్రెయిన్ ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలోని అమెరికా అగ్ర దౌత్యవేత్తతో సమావేశం కానున్న సమయంలో ఈ దాడి జరిగింది. తొలుత ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులకు పాల్పడగా.. కీవ్ దానికి ప్రతీకార చర్యలు తీసుకుంది. మాస్కో వైపుగా కీవ్ 69 డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని కూల్చివేశామని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. రష్యా రీజియన్ లోని రెండు జిల్లాల్లో 11 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే, మిగతా డ్రోన్లను ఎక్కడ కూల్చివేశారో చెప్పలేదు. కాగా.. రష్యా రాజధాని మాస్కోలోని రెండు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గాయపడినవారికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అయితే, ఈ దాడుల వల్ల పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా.. కొన్ని నెలల వ్యవధిలో రష్యాపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి అని తెలుస్తోంది.
రష్యా దాడులు
ఇదిలాఉంటే.. రష్యా (Russia) తమపై బాలిస్టిక్ మిసైల్స్, రాకెట్స్ ని ప్రయోగించిందని కీవ్ మేయర్ తెలిపారు. వీటిని తమ దళాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. కీవ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకు పేలుడు శబ్దాలు వినిపించాయని అక్కడి స్థానికులు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మంగళవారం కీలక భేటీలు జరగనున్నాయి. అటు అమెరికా, ఇటు యూరప్ దేశాలు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌తో అమెరికా చర్చలకు రెడీ అయ్యింది. అమెరికా ఉక్రెయిన్ కి సాయం నిలిపివేయడంతో.. రష్యాను ఆదుకునేందుకు ఐరోపా దేశాలు ముందుకొచ్చాయి. రష్యాను నిలువరించేందుకు సమావేశవేమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు జరగడం గమనార్హం.






