- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌కు ఆయుధాలిస్తే 50 శాతం టారిఫ్.. ప్రపంచ దేశాలకు ట్రంప్ మాస్ వార్నింగ్
ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అస్త్రాన్ని ప్రయోగించారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా- ఇరాన్ (America- Iran) మధ్య రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంప దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా గట్టి గుణపాఠం చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేసే దేశాలు, అమెరికాకు ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 50 శాతం సుంకాన్ని (Tariff) విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు, రాయితీలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. టారిఫ్‌ల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, అమెరికా-ఇరాన్ మధ్య గంటల వ్యవధిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ తన సైనిక బలాన్ని పెంచుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించారు. పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఈ శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే.






