మధ్యప్రదేశ్‌లో 42 లక్షల ఓట్లు తొలగింపు

by Muthe.Rajitha |

మధ్యప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

మధ్యప్రదేశ్‌లో 42 లక్షల ఓట్లు తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. SIR ప్రక్రియ అనంతరం డ్రాఫ్ట్ లిస్టులో 42.74 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. ఇందులో 19.19 లక్షల మంది పురుషులు, 23.64 లక్షల మంది మహిళలు ఉన్నారు మరణించినవారు 8.46 లక్షలు ఉండగా.. వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారు 31.51 లక్షలు, డూప్లికేట్ ఎన్రోల్మెంట్‌ 2.77 లక్షల మంది ఉన్నారు. 2003 రికార్డుల్లో డేటా లేకపోవడం వల్ల మ్యాపింగ్ లేనివారు మరో 8.40 లక్షల మంది ఉన్నారు.

అక్టోబర్ 27, 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.74 కోట్లకు పైగా ఉండగా.. తాజా డ్రాఫ్ట్ లిస్టులో ఇది 5.31 కోట్లకు తగ్గింది. అయితే అత్యధికంగా భోపాల్‌లోనే 4.38 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. డ్రాఫ్ట్ లిస్టుపై డిసెంబర్ 23 నుంచి జనవరి 22, 2026 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్హులైన వారు తమ పేర్లు తిరిగి చేర్చుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఫైనల్ లిస్టు ఫిబ్రవరి 21, 2026న విడుదల కానుంది.

Next Story