Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

by Prasad Jukanti |

18 జిల్లాలను కవర్ చేసేలా నాలుగు మల్టీఫుల్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
X

దిశ,డైనమిక్ బ్యూరో: 4 రైల్వే ప్రాజెక్టులకు (Railway projects) కేంద్ర కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ మీడియాకు వివరించారు. దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి (PM-Gati Shakti) కార్యక్రమం కింద సుమారు రూ.24,634 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టులను ప్రకటించింది. వీటిని 2030-2031 నాటికి పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్ లోని 18 జిల్లాలలను కవర్ చేయబోతున్నదని తెలిపారు.

ప్రాజెక్టు వివరాలు:

వార్ధా – భూసావాల్ – 3వ & 4వ లైన్ – 314 కిమీ (మహారాష్ట్ర)

గోండియా – డొంగార్గఢ్ – 4వ లైన్ – 84 కిమీ (మహారాష్ట్ర & ఛత్తీస్‌గఢ్)

వడోదర – రాత్లాం – 3వ & 4వ లైన్ – 259 కిమీ (గుజరాత్ & మధ్య ప్రదేశ్)

ఇటార్సీ – భోపాల్ – బీనా 4వ లైన్ – 237 కిమీ (మధ్య ప్రదేశ్)

Next Story