- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Punjab: పంజాబ్ లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్
పంజాబ్ పోలీసులు నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్రూప్ కోసం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ పోలీసులు నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్రూప్ కోసం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మద్దతు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, నిందితుల్లో ఒకర్ని మైనర్ గా గుర్తించారు. ఈ మేరకు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. నిందితుల్ని నరేష్ కుమార్ అలియాస్ బబ్, అభినవ్ భగత్ అలియాస్ అభి, అజయ్ కుమార్ అలియాజ్ అజ్జు, సన్నీ కుమార్ లుగా గుర్తించామన్నారు. నిందితులు పోలీసుల సర్వీస్ తుపాకీని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన తర్వాత అధికారులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. కాల్పుల్లో నిందితుడు అజయ్ కుమార్‌కు గాయాలైనట్లు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. పోలీసులే లక్ష్యంగా నిందితులు గ్రనైడ్ దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి మరింత దర్యాప్తు జరుగుతోందని డీజీపీ పేర్కొన్నారు. ఉగ్రవాద మాడ్యూళ్లను అణిచివేయడానికి, శాంతిభద్రతలను కాపాడేందుకు పంజాబ్ పోలీసులు దృఢంగా ఉన్నారని పోలీసు చీఫ్ గౌరవ్ యాదవ్ చెప్పారు.






