- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలుషిత నీరు తాగి 32 మందికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచిన పట్టణంలో కలుషిత నీరు కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి 32 మందికి అస్వస్థతకు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచిన నగరంలో కలుషిత నీరు (Contaminated water) కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి 32 మందికి అస్వస్థతకు గురయ్యారు. భగీరథపుర ప్రాంతంలో మున్సిపల్ కుళాయిల ద్వారా సరఫరా అయిన నర్మదా నది నీటిని తాగిన సుమారు 32 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు అధికారులు గుర్తించారు. బాధితులు గత కొన్ని రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి, ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. అస్వస్థతకు గురైన వారికి నాణ్యమైన, తక్షణ వైద్య చికిత్స అందించాలని ఇండోర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. "నర్మదా నీరు సరఫరా చేసే పైపులైన్లలో లీకేజీల వల్ల మురుగునీరు కలిసే అవకాశం ఉందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు" అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం స్థిరంగా ఉందని, నీటి పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ వెల్లడించారు.






