కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్ట్

by Muthe.Rajitha |

కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులను అరెస్ట్ చేసారు పోలీసులు.

కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులను అరెస్ట్ చేసారు పోలీసులు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బోర్డర్‌ పెట్రోల్‌ ఏజెంట్లు 30 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌లతో అక్రమంగా కసెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తెలిపారు. ఇంటర్‌ ఏజెన్సీ కార్యకలాపాల్లో భాగంగా ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించగా, మొత్తం 49 మంది అక్రమ వలసదారులుగా గుర్తించినట్టు యూఎస్ CBP మరో ప్రకటనలో స్పష్టం చేసింది. అక్రమ వలసలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా ఈ అరెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు.

Next Story