Madhya Pradesh: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు..!

by Shamantha N |

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో అత్యంత పాశవిక ఘటన జరిగింది. పొరుగింటికి చెందిన టీనేజర్ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Madhya Pradesh: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో అత్యంత పాశవిక ఘటన జరిగింది. పొరుగింటికి చెందిన టీనేజర్ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు క్రూరచర్య వల్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. బాలిక ప్రైవేటు భాగాలపై 28 కుట్లు పడ్డాయి. శరీరం మొత్తం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని కమలా రాజా ఆసుపత్రిలో ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దాడి చేసిన వ్యక్తి ఆమె తలను గోడకు, నేలకు పదే పదే కొట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె ముఖం, శరీరంపై పంటిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. బాలిక ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచినట్లు వెల్లడించారు. కమల్ రాజా ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు గంటల అత్యవసర సర్జరీ చేసినట్లు తెలిపారు. బాలికను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య బృందం తెలిపింది.

ఫిబ్రవరి 22న ఘటన

ఫిబ్రవరి 22 సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న బాలిక తప్పిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. చిన్నారి కోసం వెతకగా.. దాదాపు రెండు గంటల తర్వాత, వారి నివాసానికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఇంటి టెర్రస్‌పై అపస్మారక స్థితిలో, రక్తపు మడుగులో చిన్నారి కన్పించింది. కాగా.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే, ప్రస్తుతం అతడి వయసు పరిశీలనలో ఉంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం, 16-18 సంవత్సరాల వయసున్న వ్యక్తులు దారుణమైన నేరాలకు పాల్పడితే వారిని పెద్దలుగానే పరిగణించవచ్చు. కాగా.. బాధిత కుటుంబం నిందితుడికి ఈ నిబంధనను వర్తింపజేయాలని పట్టుబట్టింది. నిందితుడ్ని బహిరంగంగా ఉరితీయాలని కోరుకుంటున్నట్టు బాలిక తాతయ్య చెప్పారు. నిందితుడు మేజర్ అయినప్పటికీ అతడ్ని బాలుడిగా పేర్కొంటున్నారని బాలిక కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా, ఫిబ్రవరి 24న శివపురిలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఈ దారుణ వ్యతిరేకిస్తూ బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులు ర్యాలీ చేపట్టారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బాలికపై జరిగిన ఘటనను ఖండించారు. నిందితుడిపై "చట్టం ప్రకారం కఠినమైన చర్య" తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. వైద్య బృందంతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి నేరాలకు చోటు లేదన్న జ్యోతిరాదిత్య.. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, శివపురి పోలీస్ సూపరింటెండెంట్ తో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Next Story