లక్నో శాస్త్రవేత్తల అద్బుత ఆవిష్కరణ.. ఒకే చెట్టుకు 234 రకాల మామిడిపండ్లు

by Ajay Maddhiboyina |

రెండు మూడు కాకుండా ఏకంగా 234 ర‌కాల మామిడిపండ్లు ఒకే చెట్టుకు కాసేలా అంటుక‌ట్టు ఔరా అనిపించారు. ల‌క్కోలోని సెంట్ర‌ల్ ఇన్ స్టిట్యూట్ ఫ‌ర్ స‌బ్ ట్రోపిక‌ల్ హార్టిక‌ల్చ‌ర్ శాస్త్ర‌వేత్త‌లు ఈ అద్భుతం చేశారు.

లక్నో శాస్త్రవేత్తల అద్బుత ఆవిష్కరణ.. ఒకే చెట్టుకు 234 రకాల మామిడిపండ్లు
X

దిశ, వెబ్ డెస్క్: సాధార‌ణంగా ఒక మామిడి చెట్టుకు ఒకే ర‌కం కాయ‌లు కాస్తుంటాయి. అయితే పుల్ల‌ని కాయ‌లు, లేదా బంగ‌న్ ప‌ల్లి, లేదా తొత‌ప‌రి ఇలా ఏ రకం చెట్టుకు ఆ కాయలే కాస్తుంటాయి. కానీ అంటుక‌ట్ట‌డం ద్వారా వ్య‌వ‌సాయ‌శాస్త్ర‌వేత్త‌లు ఒకే చెట్టుకు రెండు ర‌కాల కాయ‌లు కాసేలా చేస్తుంటారు. తాజాగా రెండు మూడు కాకుండా ఏకంగా 234 ర‌కాల మామిడిపండ్లు ఒకే చెట్టుకు కాసేలా అంటుక‌ట్టు ఔరా అనిపించారు. ల‌క్కోలోని సెంట్ర‌ల్ ఇన్ స్టిట్యూట్ ఫ‌ర్ స‌బ్ ట్రోపిక‌ల్ హార్టిక‌ల్చ‌ర్ శాస్త్ర‌వేత్త‌లు ఈ అద్భుతం చేశారు. 50ఏళ్ల వ‌య‌సు ఉన్న ఓ మామిడి చెట్టుకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టడం) చేసి ఏకంగా 234 ర‌కాల మామిడి పండ్ల‌ను పండించ‌గ‌లిగారు.

కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్వ‌యంగా ఆ మామిడి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిశీలించి శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. ఆ చెట్టుకు ద‌శేరి, తోతాప‌రి, లాంగ్డా, చౌసా, స‌ఫేదా, బంగిన‌ప‌ల్లి లాంటి ఎన్నో ర‌కాల పండ్లు ఉండటం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక ఇలాంటి మామిడి చెట్టు ఒకటి ఇంట్లో ఉంటే చాలు ఎలాంటి మామిడిపండు కావాలి అంటే అలాంటివి తిన‌వ‌చ్చు. అంతేకాకుండా ఇలాంటి చెట్టు ద్వారా త‌క్కువ స్థ‌లంలోనే ఎక్కువ ర‌కాల మామిడిపండ్లు కాస్తాయి కాబ‌ట్టి వాటిని ఎంజాయ్ చేయొచ్చు. కాబ‌ట్టి మ‌న శాస్త్ర‌వేత్త‌ల కృషిని అభినందించాల్సిందే.

Next Story