- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వచ్ఛనగరంలో మళ్లీ కలుషిత నీటి కలకలం.. 22 మందికి అస్వస్థత
స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్ లో మరోసారి కలుషిత నీరు కలకలం రేగింది.

దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛనగరంగా పేరొందిన ఇండోర్ లో మరోసారి కలుషిత నీరు కలకలం రేగింది. కొద్దిరోజుల క్రితమే నగరంలోని భగీరత్ పుర ప్రాంతంలో త్రాగునీటిలో డ్రైనేజీ నీరు కలవడంతో.. ఆ కలుషిత నీటిని తాగి 23 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మౌ అనే ప్రాంతంలో తాజాగా కలుషిత నీరు తాగి 22 మంది ఆస్పత్రిపాలయ్యారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితులు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు.
సస్పెండ్ చేసినా మారని అధికారుల తీరు?
జిల్లా కలెక్టర్ శివం వర్మ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నాయి. త్రాగునీటిని సరఫరా చేస్తున్న లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా? త్రాగునీటిలో మురుగునీరు కలుస్తుందా? అని మున్సిపల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో కలుషిత నీటి కారణంగా సంభవించిన మరణాలకు బాధ్యుల్ని చేస్తూ ప్రభుత్వం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. అయినా మళ్లీ అలాంటి ఘటనే రిపీట్ కావడంతో అధికారుల పనితీరుపై బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీరు మురుగునీటి వాసన వస్తుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు త్రాగునీటిని ఫిల్టర్ చేసి, కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని, పైపుల ద్వారా వచ్చేనీటిని నేరుగా వాడొద్దని అధికారులు హెచ్చరించారు.






