2023 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితా విడుదల.. మొదటి స్థానంలో..?

by Disha Web Desk 12 |
2023 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితా విడుదల.. మొదటి స్థానంలో..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2023లో అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రెండో స్థానంలో భారత హో మంత్రి అమిత్ షా ఉన్నారు. మూడో స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నాలుగో స్థానంలో CJI DY చంద్రచూడ్, ఐదో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అలాగే తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరో స్థానంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏడో స్థానంలో.. నిలిచారు.


Next Story