- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోంజీ స్కీమ్‌లో ఉక్రెయిన్ దేశస్థులే ప్రధాన నిందితులు
ఈ కేసును విచారిస్తున్న ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్టెమ్, ఒలేనా స్టాయిన్‌ను కీలక నిందితులుగా పేర్కొంది.

- రూ.22 కోట్ల మేర మోసం
- నిందితుల్లో ఒకరు మహిళ
దిశ, నేషనల్ బ్యూరో:
ఫోంజీ స్కీమ్ పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన వారిలో ఉక్రెయిన్ దేశానికి చెందిన ఇద్దరు కీలక నిందితులుగా నిర్థారణ అయ్యింది. ముంబైలో వందలాది మంది నుంచి ఫోంజీ స్కీమ్ పేరుతో డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో టారెస్ జ్యూవెలర్స్ బ్రాండ్‌కు వ్యతిరేకంగా 1,535 మంది ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్టెమ్, ఒలేనా స్టాయిన్‌ను కీలక నిందితులుగా పేర్కొంది. వీరిద్దరిపై ప్రస్తుతం లుకవుట్ నోటీసు జారీ చేశారు. అయితే కొంత కాలం క్రితమే వీరిద్దరూ దేశం వదిలి పారిపోయిట్లు అనుమానిస్తున్నారు. టారెస్ ప్రమోటర్లు, టాప్ ఎగ్జిక్యూటీవ్స్ కలిసి భారీ మొత్తంలో రిటర్న్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్ల నుంచి రూ.22 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారు. ప్రతీ వారం 6 శాతం రిటర్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ 2024 డిసెంబర్ 30 తర్వాత అన్ని రకాల పేమెంట్లు ఆపేశారు.దీంతో మోసపోయామని గ్రహించిన ఇన్వెస్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై చీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిరసీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్టెమ్, ఒలేనా స్టాయిన్‌తో పాటు టారెస్ బ్రాండ్ మాతృసంస్థ ప్లాటినమ్ హెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు సర్వేశ్ అశోక్ సర్వే, విక్టోరియా కోవలెంకో, సీఈవో తౌసిఫ్ రియాజ్ అలియాస్ జాన్ కార్టర్ , జనరల్ మేనేజర్ తానియ కసటోవా, స్టోర్ ఇంచార్జ్ వేలెంటీనా కుమార్ నిందితులుగా చేర్చారు.






