Pahalgam Attackersఛ ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షలు..!

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్‌లో దాడికి పాల్పడిన (Pahalgam Attack) ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి.

Pahalgam Attackersఛ ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్‌లో దాడికి పాల్పడిన (Pahalgam Attack) ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో పాల్గొన్న ఈ నేపథ్యంలో ముష్కరులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీర్‌ పోలీసులు రివార్డు (reward) ప్రకటించారు. ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని అనంత్‌నాగ్‌ పోలీసులు (Anantnag Police) ప్రకటించారు. ‘ఏప్రిల్‌ 22న పెహల్గామ్‌లోని పర్యాటకులపై దాడికి పాల్పడిన పాకిస్థాన్‌ జాతీయులు (Pakistan nationals), లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, అలీ భాయ్‌, హషీమ్‌ ముసాలను బంధించడానికి, లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తాం. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము’ అని ‘ఎక్స్‌’లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలను కూడా పంచుకున్నారు.

పెహల్గాంలో దాడి

జమ్ముకశ్మీర్ లోని పెహల్గాంలో మంగళవారం జరిగిన ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. మరోవైపు, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ-సీసీఎస్ సమావేశంలో సింధూ జలాల ఒప్పందం నిలిపివేత సహా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని పాక్ కు షాక్ ఇచ్చారు.

Next Story