- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లడ్కీ బహిన్ యోజన’లో అక్రమాలు.. 14 వేల మందికి డిప్యూటీ సీఎం వార్నింగ్
మహారాష్ట్ర సర్కార్ (Maharashtra Government) మహిళల అభ్యున్నతి కోసం లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సర్కార్ (Maharashtra Government) మహిళల అభ్యున్నతి కోసం లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కానీ.. దీనివల్ల లబ్ధిపొందిన ఆడవాళ్లు ఎంతమంది ఉన్నారో కానీ.. మగవాళ్లు మాత్రం 14,298 మంది ఉన్నారు. వీరంతో అక్రమంగా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.21.44 కోట్ల నగదు వీరి ఖాతాల్లోకి బదిలీ అయినట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ చేసిన ఆడిట్ లో బట్టబయలైంది. 2024ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాదికి రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న 21 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడం ఈ పథకం లక్ష్యం.
పథకానికి అర్హులైన మహిళలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనపుడు కొందరు పురుషులు అక్రమంగా తమను మహిళలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. పథకం ప్రారంభమైన 10 నెలల తర్వాత అధికారులు ఈ విషయం తెలుసుకుని షాకయ్యారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఆ మొత్తాన్నీ వారి నుంచి తిరిగి వసూలు చేస్తామన్నారు. సహకరించని వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరినే అర్హులుగా ప్రకటించగా.. కొన్ని కుటుంబాల్లో ముగ్గురు కూడా రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.1196 కోట్ల నష్టం వస్తున్నట్లు తేలింది.






