- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం : పిడుగు పడి 14 మంది మృతి
by samatah |
పశ్చిమ బెంగాల్‌లో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నిన్న(గురువారం) రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నిన్న(గురువారం) రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి.
ఈ క్రమంలో వర్షంతో పాటు పిడుగులు పడి బెంగాల్లోని ఐదు జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పొలాల్లో పని చేసుకుంటుండగా పిడుగు పడి చనిపోయినవారే ఉన్నారు. పూర్వ వర్ధమాన్ జ్లిలాలో నలుగురు,ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే పశ్చిమ మిడ్నాపూర్, హౌరా రూరల్ జిల్లాల్లో మరో ఆరుగురు పిడుగుపాటుకు చనిపోయారని అధికారులు తెలిపారు.
Next Story






