- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Witchcraft : చేతబడి అనుమానం.. 110 మంది దారుణ హత్య
తన కుమారుడికి చేతబడి చేశారనే కోపంతో ఓ గ్యాంగ్ లీడర్ తన అనుచరులతో కలిసి ఏకంగా 110 మందిని హత్య చేయించడం సంచలనంగా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో : తన కుమారుడికి చేతబడి చేశారనే కోపంతో ఓ గ్యాంగ్ లీడర్ తన అనుచరులతో కలిసి ఏకంగా 110 మందిని హత్య చేయించడం సంచలనంగా మారింది. ఈ ఘటన కరేబియన్ దేశం హైతీలోని సిటె సొలైల్ మురికి వాడలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నేషనల్ హ్యుమన్ రైట్ డిఫెన్స్ నెట్ వర్క్ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. వివ్ అసాన్మ్ గ్రూప్‌నకు నాయకుడిగా మోనెల్ మికానో ఫెలిక్స్ వ్యవహరిస్తున్నాడు. ఫెలిక్స్ కుమారుడు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫెలిక్స్ ఈ విషయమై ఓ పూజారిని కలిశాడు. స్థానికంగా మురికి వాడలో ఉండే కొంత మంది వృద్ధులు కుమారుడికి చేతబడి చేస్తున్నారని పూజారి ఫెలిక్స్‌కు చెప్పాడు. వెంటనే వారిని ఊచకోత కోయాలని ఆదేశించాడు. దీంతో ఫెలిక్స్ గ్యాంగ్ సభ్యులు మురికివాడలోని 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. శుక్రవారం 60 మందిని, శనివారం మరో 50 మందిని కత్తులతో కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. హైతీ రాజధాని సమీపంలో ఉండే సిటె సొలైల్ మురికి వాడ అత్యంత హింసాత్మక ఘటనలు జరిగే ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ మురికివాడ మొత్తం గ్యాంగ్‌స్టర్ల కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇక్కడ మొబైల్ వినియోగంపై సైతం ఆంక్షలు ఉంటాయి. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.






