110 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం.. వాటి విలువెంతో తెలిస్తే షాక్..

by Naga Rani Yarlagadda |

ఒడిశాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వాహనంలో 110 కిలోల వెండి బిస్కెట్లు లభ్యమయ్యాయి.

110 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం.. వాటి విలువెంతో తెలిస్తే షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వాహనంలో 110 కిలోల వెండి బిస్కెట్లు లభ్యమయ్యాయి. సంబల్‌పూర్ జిల్లా రెంగాలి సమీపంలో తహశీల్ చౌక్ వద్ద ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో రాంచీకి తరలిస్తున్నట్లు వెండి బిస్కెట్లు (Silver Biscuits) పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ.1.10 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. MH01EF0549 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న స్కార్పియో SUV కంపార్ట్ మెంట్లో వెండి బార్లు లభ్యమైనట్లు తెలిపారు.

రాయ్‌పూర్ నుంచి కోల్‌కతాకు వెండిని తరలిస్తున్నట్లు సమాచారం. చంద్రకాంత్ పటేల్, సంజయ్ భాయ్ పటేల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కారులో తరలిస్తున్న వెండికి సరైన ధృవపత్రాలు చూపలేకపోవడంతో పోలీసులు వెండిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Next Story