చిరుతతో పోరాడిన 11 ఏళ్ల బాలుడు.. అడవిలోకి పారిపోయిన పులి

by Naga Rani Yarlagadda |

ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చిరుతతో పోరాడిన 11 ఏళ్ల బాలుడు.. అడవిలోకి పారిపోయిన పులి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనావాసాల మధ్య ఈ క్రూరమృగాలు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అయితే ఓ 11 ఏళ్ల విద్యార్థి మాత్రం.. తనపై దాడి చేసేందుకు వచ్చిన చిరుతను ఎదిరించాడు. అతని వద్ద ఉన్న స్కూల్ బ్యాగే అతన్ని చిరుత దాడి నుంచి రక్షించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

శుక్రవారం సాయంత్రం మాలా పద్విపాడ ప్రాంతానికి సమీపంలో 5వ తరగతి చదువుతున్న మయాంక్ కువారా అనే 11 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. అతను రెండు భుజాలకు తగిలించుకుని ఉన్న బ్యాగుపై పులి పంజా పడటంతో తొలుత భయపడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి పులిపై రాళ్లు రువ్వారు. దీంతో పులి ఆ బాలుడి దాడికి భయపడి అడవిలోకి పరుగు పెట్టింది. ఈ దాడిలో స్కూల్ బ్యాగే ఆ పిల్లాడికి ప్రాణ కవచంగా మారింది. కేకలు పెడుతూనే పులిపై దాడి చేయగా.. కాసేపటికి చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు.

బాలుడి చేతికి పులిగోర్లు గీసుకోవడంతో విక్రమ్ గడ్ విలేజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. గాయానికి కుట్లు వేశామని, బాలుడు కోలుకుంటున్నాడని వైద్య అధికారి తెలిపారు. కాగా.. చిరుతపులి సంచరించే ప్రాంతాల్లో స్కూళ్లను సాయంత్రం 4 గంటలకే మూసివేయాలని అటవీశాఖ అభ్యర్థించింది. పెద్దపులి కదలికలను ట్రాక్ చేసేందుకు ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేస్తున్నామని మోహితే తెలిపారు.

Next Story