'వంద'.. వందే భారత్ రైళ్ల ఆర్డర్ రద్దు! రైల్వే శాఖ

by Geesa Chandu |   (  Updated:2024-08-14 06:47:53  IST  )

భారత్ లోని అనేక ప్రాంతాల్లో.. వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.

వంద.. వందే భారత్ రైళ్ల ఆర్డర్ రద్దు!  రైల్వే శాఖ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లోని అనేక ప్రాంతాల్లో.. వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే దేశంలోని అన్ని సుదూర ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను నడపాలన్న ప్రభుత్వ యోచనకు ఎదురు దెబ్బ తగిలింది. రూ. 30 వేల కోట్ల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే వందే భారత్ రైళ్ల తయారీ పథకం కింద 100 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ లక్ష్యానికి ఎందుకు బ్రేక్ పడిందో చూస్తే.. రూ. 30 వేల కోట్లకు 100 రైళ్లను తయారు చేసేందుకు రైల్వే కాంట్రాక్టు తీసుకుంది. ఇందుకోసం పలు కంపెనీలు క్లెయిమ్ లు సమర్పించగా.. ఫ్రెంచ్ కంపెనీ అల్ స్టామ్ ఇండియాతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో డబ్బుకు సంబంధించి ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగకపోవడంతో ప్రస్తుతం రైల్వే శాఖ ఈ టెండర్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే వందే భారత్ రైళ్ల నిర్మాణానికి టెండర్ పై చర్చ జరిపిన అల్ స్టామ్ ఇండియా కంపెనీ ఎండీ అలివర్ లెవిసన్ .. టెండర్ లో ఇచ్చిన డబ్బుకు సంబంధించి సమస్య ఉందని వెల్లడించారు. దీంతో భారతీయ రైల్వే ఈ టెండర్ ను రద్దు చేసినట్లు తెలిపింది.

Next Story