తండ్రి, కూతురిని వరించిన ఒకే అవార్డు..

by  |
father daughter
X

దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు సీఐ సీతయ్య, ఆయన కుమార్తె అన్విత లు నేషనల్ లివింగ్ అవార్డుకు ఎంపికైయ్యారు. ఒకే అవార్డుకు తండ్రి, కూతురు లు ఎంపికకావడం విశేషం. సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల వారు నిర్వహించే వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి, వివిధ కళల్లో నైపుణ్యం గలవారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సాహిత్య సాంస్కృతిక జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 22ను మందిని ఎంపిక చేయగా ఇందులో తండ్రి, కూతురు ఎంపిక కావడం విశేషమని వ్యవస్థాపక అధ్యక్షులు గుణగళ్ళ విజయ్ కుమార్ తెలిపారు.

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలానికి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీఐ ఎరుకొండ సీతయ్య కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలను స్వయంగా నిర్వహించారు. హైదరాబాదులో 8వ తరగతి చదువుచున్న సీత్తయ్య కూతురు ఎరుకొండ అన్విత కూచిపూడి నృత్యంలో ప్రతిభకు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఇట్టి అవార్డును ఆగస్టు 13న విశాఖపట్నంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జాతీయస్థాయిలో ఎంపికైన 22 మందికి ఈ అవార్డుతో సత్కారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ అవార్డు ఎంపికపట్ల జిల్లా, ఆత్మకూరు పట్టణ, మండల, అధికారులు, అఖిలపక్ష నాయకులు, రెడ్ క్రాస్ సభ్యులు, స్వచ్చంధ సంస్థలు అభినందనలను తెలిపారు.


Next Story

Most Viewed