స్టేషన్ ఘన్ పూర్ లో విగ్రహాల రగడ.. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే..

by  |
స్టేషన్ ఘన్ పూర్ లో విగ్రహాల రగడ.. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే..
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జాతీయ రహదారి నిర్మాణం కోసం తొలగించిన అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం రోడ్డుపై ఉన్న అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను తొలగించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అన్నారు. విగ్రహాలను తొలగించి నాలుగేళ్లు గడుస్తున్నా వాటి పునరుద్ధరణపై దృష్టి పెట్టకపోవడం తీవ్రంగా దుయ్యబట్టారు.

ఇప్పటికైనా జాతీయ రహదారి విస్తరణ అధికారులు స్పందించి జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి నాటికి విగ్రహాలను ప్రతిష్టించాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖా గట్టయ్య, జడ్పీటీసీలు రవి, బేబీ శ్రీనివాస్, డైరెక్టర్ ఆకుల కుమార్, కర్ర సోమిరెడ్డి, తాటి కొండ సురేష్ కుమార్, మాచర్ల గణేష్, ప్రసాద్, చేరాలు, మల్లేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహ భూమి పూజ చేశారు.



Next Story