కృష్ణ, లీలా ‘నరుడి బ్రతుకు నటన’

by  |
కృష్ణ, లీలా ‘నరుడి బ్రతుకు నటన’
X

దిశ, వెబ్ డెస్క్: సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కొత్త సినిమా ప్రకటించింది. కృష్ణ తన లీలతో కలిసి మళ్లీ వచ్చేస్తున్నాడు అంటూ కొత్త సినిమా విశేషాలు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రాన్ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా..‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూర్చనున్నారు. పిడివి ప్రసాద్ సమర్పణలో వస్తున్న చిత్రం షూటింగ్ దీపావళికి ప్రారంభం కానుంది.

https://twitter.com/SitharaEnts/status/1314514720490045440?s=20

సిద్ధు, శ్రద్ధ కాంబినేషన్‌లో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా సూపర్ హిట్ కాగా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, టైటిల్ అండ్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉండటంతో ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి.



Next Story

Most Viewed