నేచురల్ స్టార్ ఆవిష్కరించిన ‘అద్భుతం’

by  |
Adbhutam-poster
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ‌ స‌జ్జ, హ్యాపెనింగ్ బ్యూటీ శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా మ‌ల్లిక్ రామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అద్భుతం’. మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్లపై చంద్రశేఖ‌ర్ మొగుళ్ల నిర్మిస్తున్న సినిమాకు ‘అ!, కల్కి, జాంబి రెడ్డి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. ఈ రోజు(గురువారం) శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘అద్భుతం’ ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ‘అద్భుతం’ టైటిల్‌కు త‌గ్గట్లుగానే ద‌ర్శకుడు మల్లిక్.. మూవీ ఫ‌స్ట్ లుక్‌ను అప్ అండ్ డౌన్ ప‌ద్ధతిలో వినూత్నంగా డిజైన్ చేశారు.

ప్రస్తుతం ఈ లుక్ సోష‌ల్ మీడియా ట్రెండింగ్‌లో ఉండగా.. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటుందని నిర్మాత చంద్రశేఖ‌ర్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివ‌రాలను త్వర‌లోనే అధికారికంగా ప్రక‌టిస్తామ‌ని వెల్లడించారు. లక్ష్మీ భూపాల స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రానికి రధన్ మ్యూజిక్ డైరెక్టర్‌ కాగా.. స‌త్య, మిర్చి కిర‌ణ్, తుల‌సి, శివాజీ రాజా త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story