‘హిట్-2’పై నాని అఫీషియల్‌ అనౌన్స్

by  |
‘హిట్-2’పై నాని అఫీషియల్‌ అనౌన్స్
X

దిశ, సినిమా : విలక్షణమైన కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని.. తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘వాల్ పోస్టర్’ బ్యానర్‌ స్థాపించి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ బ్యాన‌ర్‌పై యువ దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మితమైన ‘హిట్’ మంచి సక్సెస్ అందుకుంది. నాని ఫ్యాక్టర్, విశ్వక్ సేన్‌కు యూత్‌లో వున్న క్రేజ్‌తో పాటు కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ పక్కాగా కుదరడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. అయితే ఈ చిత్రం విడుదలై నేటితో ఏడాది పూర్తైన సంద‌ర్భంగా నాని త‌న ట్విట్టర్‌లో హిట్ మూవీకి సీక్వెల్ ప్రక‌టించడం విశేషం.

‘హిట్’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని సినిమా ఎండింగ్‌లోనే డైరెక్టర్ హింట్ ఇవ్వగా, తాజాగా ‘హిట్-2’ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు నాని. ఫస్ట్ పార్ట్ తెలంగాణ నేప‌థ్యంలో సాగ‌గా, సీక్వెల్ ఏపీ నేప‌థ్యంలో ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఇందులో ‘కేడీ’ అనే రోల్‌ కీలకం కాగా, ఈ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తున్నారు? హీరో విశ్వక్ సేన్ కొనసాగుతాడా? లేక మరకొరు లీడ్ రోల్ పోషిస్తారా? లేక ఇద్దరు హీరోలుంటారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నాని త్వరలోనే ఆ వివరాలపై అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

https://twitter.com/NameisNani/status/1365900551204917248


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed