నందమూరి హీరో 'డెవిల్' లుక్.. బ్రిటీష్ వారికి చుక్కలే

by  |
kalyan ram news
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో విజయం కోసం ఎదురుచూసే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. ‘పటాస్’ చిత్రం తర్వాత అంతటి విజయం ఇప్పటి వరకు కళ్యణ్ రామ్ అందుకోలేదనే చెప్పాలి. ఇక ఈ మధ్య విడుదలైన ఎంత మంచివాడవురా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన తర్వాత కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపధ్యలోనే ఈసారి నందమూరి హీరో భారీ ప్రాజెక్ట్ లనే లైన్లో పెట్టాడు. ఇక నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో వరుసగా ఆయన సినిమా అప్ డేట్లను మేకర్స్ తెలుపుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ అనే సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక తాజాగా నేడు మరో మూడు చిత్రాలకు సైన్ చేసినట్లు తెలిపాడు.

https://twitter.com/Gopimohan/status/1412001589670277121?s=20

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో #NKR19 ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ క్రమంలో తన 20వ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ రెండింటితో పాటు మరో చారిత్రత్మక చిత్రాన్ని ప్రకటించి అబిమానులకు షాక్ ఇచ్చాడు. ‘డెవిల్.. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడనే చెప్పాలి. ట్రైన్ లో పంచె, కోటు వేసుకొని , చేతిలో తుపాకీతో పోరాటం చేస్తున్నట్లు కనిపించాడు. ఇక రైలు పైన భారత జెండాను పట్టుకున్న భారతీయులను చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే బ్రిటీష్ కాలంలో దేశం కోసం పోరాడే ఒక నాయకుడిగా నందమూరి హీరో ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు.

Next Story