- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో నేరుగా ఎవరిపై విమర్శ చేస్తున్నారో.. వారికి తెలిసేలా ట్వీట్ చేసిన నాగబాబు… ఈ సారి నర్మగర్భంగా ట్వీట్ చేయడం విశేషం. “కర్మకు ఏ విధమైన మెనూ లేదు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుందో లేదో తెలియదు. అయితే, టీడీపీ ఇప్పుడు వారి డెజర్ట్ ను వడ్డిస్తోంది. ఇది ఒక ప్రారంభం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో నేరుగా ఎవరిపై విమర్శ చేస్తున్నారో.. వారికి తెలిసేలా ట్వీట్ చేసిన నాగబాబు… ఈ సారి నర్మగర్భంగా ట్వీట్ చేయడం విశేషం. “కర్మకు ఏ విధమైన మెనూ లేదు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుందో లేదో తెలియదు. అయితే, టీడీపీ ఇప్పుడు వారి డెజర్ట్ ను వడ్డిస్తోంది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఏడు వంటకాలున్న భోజనంలో 1 వంటకం మాత్రమే అందించబడింది, టీడీపీ వారు నాటిన విత్తనాల నుంచి ఇప్పుడు ప్రతిఫలాలను పొందుతోంది” అని వ్యాఖ్యానించారు. నాగబాబు ట్వీట్ వైరల్ కాగా, ఇంతకీ ఆయన దేనిని ఉద్దేశించి టీడీపీపై ఈ సెటైరికల్ ట్వీట్ చేశారంటూ నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు.
Next Story






