హోమ్ బ్యానర్‌లో నాగశౌర్య కొత్త సినిమా..

by  |
హోమ్ బ్యానర్‌లో నాగశౌర్య కొత్త సినిమా..
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో నాగ శౌర్య మరో సినిమాను ప్రకటించారు. హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో లాంఛనంగా ప్రారంభించిన సినిమాకు కొరటాల శివ క్లాప్ ఇవ్వగా.. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేశారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నాగ శౌర్యకు 22వ చిత్రం కాగా.. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

కాగా, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై శౌర్య ఇప్పటికే ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్చరీ నేపథ్యంలో రాబోతున్న ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే కాగా.. నారాయణ్ దాస్ కె నరంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండగా.. కాల భైరవ సంగీతం అందించనున్నారు. కాగా ఈ చిత్రం కోసం నాగశౌర్య ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed