నదాల్.. మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?

by  |
నదాల్.. మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?
X

దిశ, స్పోర్ట్స్: స్పెయిన్ బుల్, వరల్డ్ నెంబర్ 3 రఫెల్ నదాల్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఆడుతూ చాలా బిజీగా ఉన్నాడు. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి రోజర్ ఫెదరర్ రికార్డును అధిగమించడమే లక్ష్యంగా దూసుకొని పోతున్నాడు. అయితే నదాల్ ఆదివారం ఫేస్‌బుక్‌లో చేసిన అప్‌డేట్ అతడి అభిమానులే కాకుండా టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. ఫేస్‌బుక్‌లో ‘Gor Married’ అంటూ అప్‌డేట్ చేశాడు. వాస్తవానికి రఫెల్ నదాల్‌కు 2019 అక్టోబర్‌లోనే మారియో పరెల్లోతో పెళ్లైంది. వారిద్దరూ అంతకు ముందే చాలా ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

కానీ సడెన్‌గా నదాల్ ఫేస్‌బుక్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ మార్చడంలో అందరూ ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. ‘ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావ్’ అని ఒకరు కామెంట్ పెడితే.. ‘నీకు మళ్లీ పెళ్లేంటి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొంత మంది అసలు విషయం తెలియక ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు’ కూడా చెప్పారు. అసలు ఏం జరుగుతుందో ఆరా తీయగా.. నదాల్ రిలేషిన్‌షిప్ స్టేటస్ ఎన్నాళ్ల నుంచో సింగిల్ అనే ఉండటంతో దాన్ని మార్చాడు. అయితే పాత డేట్ మార్చడం మాత్రం మర్చిపోవడంతో జూన్ 6న పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తున్నది. ఇదే అందరూ అయోమయానికి గురవడానికి కారణమైంది.



Next Story

Most Viewed