- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మర్మాంగాలను కోసి కిరాతకంగా హత్య
<p>దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ శివారులోని ఓ వెంచర్ లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు మర్మాంగాలను కోసి కిరాతకంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి (32) మద్యానికి బానిసై ఎటువంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. యాదగిరి బాధలు భరించలేక తల్లి నీలమ్మ పటాన్‌చెరు లోని బంధువుల వద్ద […]</p>

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ శివారులోని ఓ వెంచర్ లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు మర్మాంగాలను కోసి కిరాతకంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి (32) మద్యానికి బానిసై ఎటువంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. యాదగిరి బాధలు భరించలేక తల్లి నీలమ్మ పటాన్‌చెరు లోని బంధువుల వద్ద ఉంటుంది. భార్య, ఇద్దరు పిల్లలతో యాదగిరి చిట్కుల్ లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి యాదగిరి, భార్య సంతోషా తో గొడవపడి బయటికి వెళ్ళాడు.
కాగా చిట్కుల్ వడ్డెర కాలనీలోని సాధన్యా వెంచర్ లో సిమెంట్ ఇటుక రాళ్లతో అతని తలపై మోది మర్మాంగాలను కోసి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై తలపై సిమెంట్ ఇటుక రాళ్లతో మోది, మర్మాంగాలు కోసిన ఆనవాళ్లును పోలీసులు కనుగొన్నారు. పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని పూర్వాపరాలను పరిశీలించారు. హత్యకు సంబంధించిన కారణాలపై ఆరా తీశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో మృతదేహం పరిసరాలను పరిశీలించారు. మృతుడు గతంలో చిన్న చిన్న దొంగతనాలు, ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. హత్యకు గల కారణాలను అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.






