ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళదాం : ఎమ్మెల్యే సీతక్క

by  |
seethakka
X

డిశ, కుత్బుల్లాపూర్ : ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని కోరుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం కొంపల్లిలో కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్బంగా గాజులరామారం డివిజన్ కు చెందిన పలు పార్టీ ల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా సీతక్క కండువా కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందు గౌడ్ , ఎండీ పాషా, మహిపాల్ రెడ్డి, సురేష్, శ్రీను, మీర్జా తదితరులు పాల్గొన్నారు.

Next Story