- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. చేవెళ్ల ఎంపీకి కరోనా పాజిటివ్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, చేవెళ్ల: చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డికి కరోనా సోకింది. ముందు జాగ్రత్త కొరకు శనివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా యాంటీజెన్ రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఎంపీ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళారు. వైద్యులను సంప్రదించి, తగు మందులు తీసుకుంటూ, జాగ్రత్తలు వహిస్తున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనను గత మూడు, నాలుగు రోజులుగా కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తగు జాగ్రత్తలు […]</p>

X
దిశ, చేవెళ్ల: చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డికి కరోనా సోకింది. ముందు జాగ్రత్త కొరకు శనివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా యాంటీజెన్ రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఎంపీ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళారు. వైద్యులను సంప్రదించి, తగు మందులు తీసుకుంటూ, జాగ్రత్తలు వహిస్తున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనను గత మూడు, నాలుగు రోజులుగా కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తగు జాగ్రత్తలు వహిస్తూ, వీలైనంత వరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో పి ఏ, ఇతర సిబ్బంది
తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ కలవడానికి తన వద్దకు రావద్దని ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు పీ ఏ, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, ప్రజలు సహకరించాలని కోరారు.
Next Story






