కేసీఆర్.. ఏపీ, ఢిల్లీ సీఎంలను చూసి బుద్ది తెచ్చుకో!

by  |
కేసీఆర్.. ఏపీ, ఢిల్లీ సీఎంలను చూసి బుద్ది తెచ్చుకో!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కోరలు చాచుతోంది. ప్రతి రోజు 1000కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఏపీలో 10 లక్షల టెస్టులు చేస్తే.. ఇక్కడ లక్ష మాత్రమే చేశారని.. ఇది కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీ, ఢిల్లీ సీఎంలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని కేసీఆర్‌కు చురకలు అంటించారు.

ప్రగతిభవన్‌లో నలుగురికి కరోనా వస్తే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లడం సమంజసం కాదన్నారు. ఫామ్ హౌస్‌లోనూ కరోనా వస్తుందని.. అది తన శాపం అని కోమటిరెడ్డి అన్నారు. కరోనా చికిత్సకు ప్రజల నుంచి డబ్బు వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోమటి రెడ్డి సూచించారు. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందన్నారు. అక్కడ మొదటి నుంచి టెస్టు, ట్రేస్, ట్రీట్ అనే డబ్ల్యూహెచ్‌వో విధానాన్ని పాటిస్తోందని, కానీ తెలంగాణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని కోమటి రెడ్డి విమర్శించారు.

Next Story

Most Viewed