ACP ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా తెలిస్తే షాక్

by Rajesh |
ACP ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఆస్తుల చిట్టా షాక్‌కు గురి చేస్తోంది. అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్ టాప్‌లలో సమాచారాన్ని ఏసీబీ అధికారలుు విశ్లేషిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాగా, శామీర్ పేట్‌లో ఆర్ఎస్ కన్‌స్ట్రక్షన్‌లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేలింది. 333 చదరపు గజాల స్థలంలో 4,400 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియాతో విల్లా ఉన్నట్లు తెలిసింది. విల్లా కోసం రూ.50 చెల్లింపు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.

జవహర్ నగర్ అయ్యప్పనగర్ కాలనీ సమీపంలో మూడు గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.10 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. అలాగే ఘట్‌కేసర్ మండలం ఘన్‌పూర్‌లో స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపుగజాల ఓపెన్ ప్లాట్ కోసం రూ.19లక్షల 90 వేలు చెల్లించినట్లు తేలింది. మామ సతీష్ బాబు పేరిట 239 గజాల ఓపెన్ ప్లాట్ కోసం రూ.37.54 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. అలాగే శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలో సర్వే నంబర్ 530లో 14 గుంటల భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోకా ఒర్నాటలో సుశీల పేరిట 1385 చదరపు అడుగుల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించారు.

కూకట్ పల్లి సర్వే నంబర్ 1007లో సుశీల పేరుతో 200 చదరపు గజాల ప్లాట్ కొనుగోలు చేశారు. విశాఖ పట్నం జిల్లా పినగాడిలో 25 సెంట్ల స్థలాన్ని రూ.7.5 లక్షలతో 2014లో మామ సతీష్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. 2014లోనే విశాఖ జిల్లా చోడవరం న్యూ శాంతినగర్ కో-ఆపరేటివ్ కాలనీలో రూ.4.80లక్షల విలువైన 240 గజాల ప్లాట్‌ను సతీష్ బాబు పేరిట కొనుగోలు చేశారు. చోడవరం మండలం దొండపూడిలో సర్వే నంబర్ 209లో రూ.32.56 లక్షలతో 5.92 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దొండపూడిలోనే రూ.12.10 లక్షలతో 2.2 ఎకరాల స్థలాన్ని విక్రయించారు.

Next Story