Ap News: రుషికొండ భవనాలపై వైసీపీ ట్వీట్‌కు టీడీపీ కౌంటర్

by srinivas |
Ap News: రుషికొండ భవనాలపై వైసీపీ ట్వీట్‌కు టీడీపీ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: రుషికొండ భవనాలపై వైసీపీ ట్వీట్‌కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పాలన రాజధానిగా ప్రకటించి ఎన్నికల ముందు రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే ఈ భవనాలను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ సందర్శించారు. రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి భవన నిర్మాణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అత్యద్భుతంగా నిర్మిచారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు రూపాయి జీతం తీసుకున్న పేద ముఖ్యమంత్రి అత్యంత ఖరీదైన భవనాలను నిర్మించుకున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఈ భవనాలను లైవ్‌లో ప్రజలు చూపించి విమర్శలు చేశారు.

దీనిపై వైసీపీ ట్వీట్టర్ వేదికగా స్పందించింది. ఆ భవనాలు ప్రభుత్వానివేనని, ప్రైవేటు కాదని తెలిపారు. విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు వచ్చినప్పుడు అక్కడ ఉండేందుకు వీలుగా ఖరీదైన భవనాలు నిర్మించినట్లు ట్వీట్ చేసింది. దీంతో వైసీపీ నాయకులపై మాటలు పేలుతున్నాయి. భలే కవర్ చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే ఇన్ని రోజులు ముళ్ల కంచెలు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ప్రజలను ఎందుకు దూరంగా ఉంచారని నిలదీశింది. దొరికిపోయిన తర్వాత కథలు ఎందుకు చెబుతున్నారంటూ టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed